ఆదిశిలా క్షేత్రంలో రేపు మహాశివరాత్రి

Mar 7, 2024 - 16:26
 0  3
ఆదిశిలా క్షేత్రంలో రేపు మహాశివరాత్రి

జోగులాంబ గద్వాల 7 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి  దేవాలయంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. రుద్ర భూమి గా పిలువబడే మల్దకల్ క్షేత్రం వారణాసి కాశి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలతో సమానంగా ఇక్కడ ఈశ్వరుడు పూజలందుకుంటున్నాడు.ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ప్రముఖశైవక్షేత్రాల సందర్శన పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ క్షేత్రం హరిహరాదుల క్షేత్రం గా విలసిల్లుతూ భక్తుల పూజల అందుకుంటున్నది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు నమక చమకాలతో రుద్రాభిషేకం, బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే శ్రీశైలం, కాశీ పుణ్యక్షేత్రాల దర్శనం దక్కుతుందని ప్రతీతి. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈశ్వర కటాక్షం పొందాలని వారు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333