మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో డాక్టర్ సత్యం మడే వీరు
మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో డాక్టర్ సత్యం మడే వీరు ప్రస్తుతం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ( TJAC ) కి GHMC మరియు HMDA కో ఆర్డినేటర్ గా, శైలి గార్డెన్ పేజ్ 2 కు ప్రెసిడెంట్ గా ఉంటూ "ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా" ఉంటూ అనేక కాలనీల మరియు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక అభివృద్ధి పనులతో పాటు ప్రజాసేవలో ఉన్నారు. డాక్టర్ సత్యం మడే గారు ప్రముఖ జాతీయ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు విశ్వాసనీయ సమా చారం. వారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినారు. ప్రస్తుతం ప్రముఖ జాతీయ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండ వచ్చు అని విశ్వాసనీయ వర్గాల సమాచారం. వీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జి.హెచ్.ఎం.సి. చేయవలసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గవర్నమెంట్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలను అభివృద్ధి చేసే దిశగా పరోక్షంగా ప్రత్యక్షంగా దోహద పడ్డారు. వీరు నిరంతరం ప్రజాసేవ కోసం కృషి చేస్తూ ఉంటారు.