రెండు బైకులు డీ..ముగ్గురికి తీవ్ర గాయాలు
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను పోలీస్ వాహనంలో అడ్డగూడూరు ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రజలను రక్షించడమే మా డ్యూటీ అన్న పోలీస్ లు
అడ్డగూడూరు 25 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఎదురెదురు వస్తూ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి, గురువారం ఉదయం10 గంటల సమయంలో గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన తురికిపాటి మత్యగిరి, మహేష్ నకిరేకల్ వెళ్తుండగా అడ్డగూడూరు మండలం ఆజింపేట గ్రామానికి చెందిన పండుగ సాయిలు, కన్నెబోయిన యాదగిరి వ్యవసాయ పనుల నిమిత్తం నకిరేకల్ వెళ్లి తిరిగి వస్తుండగా మానాయకుంట బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఢీకొనగా ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి చౌళ్లరామారం కు చెందిన మత్స్యగిరిని ప్రైవేట్ వాహనంలో నకిరేకల్ కు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అజింపేట గ్రామానికి చెందిన సాయిలు,యాదగిరిని అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు 100 నెంబర్ కు డయల్ చేయడంతో అడ్డగూడూరు ఎస్ఐ నాగరాజు ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోనే పెట్రోలింగ్ సిబ్బంది పరశురాములు,విజయ్ అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్షతగాత్రులను తరలించారు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకై సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.మానాయకుంట రైతులు బ్రిడ్జిపై ధాన్యం ఎండపోస్తున్నరు వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదంలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రోడ్డుకు ఇరువైపున ధాన్యాన్ని నిల్వ చేయకూడదని పోలీసులు, రైతులకు,గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.