అలంపూర్ తాలూకా లిఫ్ట్-ఇరిగేషన్ రైతులు మరియు రైతు సంఘాల నాయకులతో
విద్యుత్ అధికారుల సమావేశం
జోగులాంబ గద్వాల 9 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. తాలూకా పరిధిలోని పలు వ్యవసాయ లిఫ్ట్-ఇరిగేషన్ స్కీములకు చెందిన రైతులు మరియు ఇతర రైతుసంఘాల నాయకులతో శుక్రవారం అనగా తేది 09.08.2024 నాడు అలంపూర్ చౌరస్తాలో గద్వాల డివిజనల్ మరియు అలంపూర్ సబ్-డివిజన్ అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయమై వాకబు చేయటానికి రైతులతో సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమములో బుక్కాపూర్, ఉట్కూర్, బుడ్డమర్సు, అలంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు చెందిన పలు రైతులు, లిఫ్ట్-కమిటీ సభ్యులు మరియు మారమునగాల రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే వీరితో పాటు పలు కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ వినియోగదారులు కూడా పాల్గొని నాణ్యమైన విద్యుత్ సరఫరా మరియు పునరుద్ధరణ తో పాటు పలు అంశాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ వివిధ సమస్యలు తెలియజేయగా విద్యుత్ అధికారులు సానుకూలంగా స్పందించి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేసి అందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేశారు.
అలాగే ఈ సందర్భంగా రైతులు మరియు విద్యుత్ వినియోగదారులు తమ యొక్క సమస్యల గురించి తెలియజేస్తే మరింత మెరుగైన సేవలు అందించటం కొరకు విద్యుత్ అధికారులు వారి యొక్క మొబైల్ నంబర్లను కూడా వినియోగదారులకు తెలియచేయడమైనది.
ఈ సమావేశంలో గద్వాల DE లక్ష్మణ్, అలంపూర్ ADE సయ్యద్ మఖ్బుల్ మరియు అలంపూర్, మానోపాడ్, ఎర్రవల్లి, శాంతినగర్, ఉండవెల్లి మండలాల AE లు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.