ప్రత్యేక అలంకరణలో పిల్లలమర్రి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి
_ ఆలయ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం
సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) మే 23:మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు శుక్రవారం సందర్భంగా స్వామి వారిని అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు విశేషంగా అలంకరించారు.శుక్రవారం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.అర్చకుడు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం స్వామి వారికి పుష్పాలంకరణ సేవ ఉంటుందని భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి కృపకు పాత్రులు కాగలరు అని తెలిపారు.అనంతరం దేవాలయ నిర్మాణ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో కీ. శే ఉమ్మెంతల చక్రపాణి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి నివాళులర్పించి తదుపరి చకిలం సుదర్శన్ రావు సేకరించి రచించిన చెన్నకేశవ స్వామి ఆలయ చరిత్ర (త్రిమూర్తి నివాస క్షేత్రం పిల్లలమర్రి) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెత్తల ఆహ్లాద రావు, హరి ప్రసాద్, జగన్నాధ రావు, వరప్రసాదరావు ,చక్రధర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ గూకంటి రాజాబాబు రెడ్డి కమిటీ సభ్యులు కందకట్ల రాంబాబు, మల్లికార్జున్ ,శంకర్,గ్రామస్తులు రాపర్తి మహేష్ ,సోమగాని లింగస్వామి ,చెరుకుపల్లి శ్రీనివాస్ ,గడ్డం వెంకటేశ్వర్లు, సైదులు ,తూటిపల్లి సత్తయ్య ,అంక బిక్షం తదితరులు పాల్గొన్నారు.