ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేతకేసు నమోదు

Jul 11, 2024 - 21:08
 0  4
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేతకేసు నమోదు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేతకేసు నమోదు ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని తుమ్మలపెన్ పహాడ్అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు గురువారం ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. మోతే మండలం కూడలి నుండి చివ్వెంల కు ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ నంబర్ TS 29 TA 7772 ను తుమ్మల పెంపహాడ్ వద్ద పట్టుకుని అట్టి డ్రైవింగ్ చేస్తున్న ఓనర్గుగులోతు రెడ్డి మీద కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. మండల ఇసుక ట్రాక్టర్లకు అధికారుల మినహాయింపు ఆత్మకూరు మండలం లో ని రామన్నగూడెం ఏపూరు ముక్కుడుదేవులపల్లి మక్త కొత్తగూడెం గ్రామాల నుండి ప్రతిరోజు 30 ట్రాక్టర్ ల కు పైగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతినిత్యం పోలీస్ స్టేషన్ రెవిన్యూ కార్యాలయం ముందు నుండి ఇసుక తరలిస్తున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూర్ మండల ట్రాక్టర్ల కు పోలీసులు రెవిన్యూ అధికారులు ఇసుక తరలింపు కు అనుమతులు ఇచ్చారా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.