వెల్దేవి గ్రామపంచాయతీ ఆవరణంలో ఓటర్ జాబితా ప్రదర్శన!కార్యదర్శి మౌనిక రెడ్డి
అడ్డగూడూరు 13 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డ్ తయారు చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలను శుక్రవారం రోజు గ్రామ కార్యదర్శి రాచ్చ మౌనిక రెడ్డి ఆధ్వర్యంలో వెల్దేవి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శన నిర్వహించారు.అడ్డగూడూరు ఎంపీడీవో డి.శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 14 తేదీ నుండి 21 తేదీ వరకు ఈ వారం రోజుల్లో సమయంలో గ్రామస్తులు గ్రామపంచాయతీ వచ్చి ఓటర్ జాబితాలో తప్పులు సరి చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఓటర్ జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే లికిత పూర్వకంగా రాసి గ్రామ పంచాయతీలో ఇవ్వాలని అన్నారు.అదేవిధంగా రాజకీయ పార్టీలు మండల స్థాయి ప్రజా ప్రతినిధులతో 19 తేదీన వార్డు వారిగా ఓటరు జాబితా సమావేశం నిర్వహించబడుతుందని ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అందరూ హాజరు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రచ్చ మౌనిక రెడ్డి,బిఆర్ఓ బి.వసంత,ఫీల్డ్ అసిస్టెంట్ పి.స్వర్ణ, కుంభం సత్యమ్మ,గ్రామస్తులు రాచకొండ సతీష్, గోలి సుమన్,రేకుల బిక్షం,కుంభం వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.