రాజయ్య నగర్ గ్రామంలోని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి

Feb 1, 2025 - 15:18
 0  5
రాజయ్య నగర్ గ్రామంలోని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి

1/2/2025

చర్ల మండలం 

గిరిజన విద్యార్థులకు విద్యను అందించడంలో అధికారులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నశించాలి

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్

చర్ల మండలం సుబ్బంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రాజయ్య నగర్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ చైర్మన్ కేపి జోస్, జోమోల్ వారి సహకారంతో గ్రామంలో ఉన్న 25 మంది విద్యార్థుల చదువులకు అవసరమైన బ్యాగులు పెన్నులు పుస్తకాలు బోర్డు మరియు తాత్కాలిక ఉపాధ్యాయురాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 21/ఎ ఉచిత నిర్బంధ విద్య 2009 చట్టం ప్రకారం భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా ఆరు నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ఉచితంగా విద్యను అందించాలని భారత రాజ్యాంగ చట్టం చెబుతున్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వ విద్య అందడం లేదని అందులో భాగంగా చర్ల మండలంలోని సుబ్బంపేట పంచాయతీలోని రాజనగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదని తక్షణమే ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ అన్నారు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చదువుకు దూరం అవుతున్న రాజయ్య నగర్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని ఐపీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ వారు విద్యార్థులు చదువులకు అవసరమైన పెన్నులు పుస్తకాలు మరియు ఉపాధ్యాయురాలని నియమించడం సంతోషకరమైన విషయం అని అన్నారు ఈ రకమైన కృషిచేసిన ఐపిఎఫ్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు స్వచ్ఛంద సంస్థలు స్పందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ప్రభుత్వలా నిర్లక్ష్యం కారణంగా ఉచిత నిర్బంధ హక్కు చట్టం అపహస్యం అవుతుంది భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసి ప్రాంతాల్లో ఉచిత నిర్బంధ విద్య ఏర్పాటు చేయవలసి ఉండగా ప్రభుత్వాలు ఆ పనిని విస్మరించి ఆదివాసి బాలబాలికలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం దుర్మార్గం అని అన్నారు ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి గిరిజన బిడ్డలకు నాణ్యమైన నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్, పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చల్లగుండ్ల సతీష్ చౌదరి పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండ కౌశిక్ పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్ మరియు ఐపీఎఫ్ సంస్థ నాయకులు వి దానియేలు, హనూక్, జి జాన్ పాల్, ఏ బెన్నీ మరియు గ్రామస్తులు రేగ ఆంధ్రయ , బాయమ్మ , జములు, జోగయ్య, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు