చేనేత వృత్తిలో ఉన్నప్రతి ఒక్కరికి జియోట్యాగ్ నెంబర్ వేయాలి

Feb 1, 2025 - 18:31
Feb 1, 2025 - 18:32
 0  9
చేనేత వృత్తిలో ఉన్నప్రతి ఒక్కరికి జియోట్యాగ్ నెంబర్ వేయాలి

భువనగిరి 1 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

భువనగిరి మండల కేంద్రంలో చేనేత ఏడి ఆఫీసులో జియోట్యాగ్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్ మాట్లాడుతూ..చేనేత వృత్తిలో ఉన్నప్రతి ఒక్కరికి జియోట్యాగ్ నెంబర్ వెయ్యాలని ప్రభుత్వం పథకాలలో అందరికీ అందించాలని మగ్గం నేసే కార్మికునికి జియోట్యాగ్ నెంబరు వేసి అతనికి ఒక హెల్పర్ కు అవకాశం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. వృత్తిలో ఉన్న అందరికీ జియోట్యాగ్ నెంబర్ వేయకపోవడం వలన ప్రభుత్వా పథకాలకు దూరం అవుతున్నారు. ఆలోచన చేయాలి వృత్తులో ఉన్న వారందరికీ జియోట్యాగ్ నెంబరు వెయ్యాలని ఒక చేనేత వస్త్రం తయారు కావాలంటే నులు పెట్టనుండి పంటేలు పోయాలి డిజైన్ రావడానికి పోగులు లెక్కించాలి పేక చిటీకిపోయాలి డిజైన్ వేయాలి రబ్బర్లు చుట్టాలి రంగులు అద్దాలే వర్పులు చేయాలి అచ్చులు అత్తకాలి అల్లులు కలపాలి కండేలు పట్టాలి మగ్గం నెయ్యాలి అప్పుడు వస్త్రం తయారవుతుంది మగ్గం నేసే ఒక్కరికి జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి అతనికి ఒక హెల్పర్ అవకాశం ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి చేనేత వృత్తి పని చేసే వాళ్ళందరికీ ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి సుమారు 14 మంది పని చేస్తే ఒక చీరే తయారవుతుంది ఒక వస్త్రం తయారవుతుంది.అప్పుడు అగ్గిపెట్టలో చీరని నేసేది అంటే 14 మంది కలిస్తేనే ఆ చీర తయారై అగ్గిపెట్టలో పెట్టడం జరిగింది.కానీ ముగ్గురికె జియో ట్యాగ్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో కనపడుతుంది.దీని గుర్తించలేకపోతున్న ప్రభుత్వం ఏదో చేనేత కార్మికులకు జియోట్యాగ్ ఇస్తుందని చెప్పి చేతులు దులుపుకొని చేనేత కాబట్టి అన్ని మేము చేస్తున్నామని ప్రగాఢాలు పలుకుతున్నాయి శనివారం రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రైతుకు ఎలాగా రైతు బంధిస్తుందు ఇస్తుంది కాబట్టి చేనేత కార్మికులకు చేనేత బంధు ఇవ్వాలని చేనేత కార్మికులందరికీ అన్ని రకాల వాళ్ళని ఆదుకొని పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.