ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్
చర్ల, ఫిబ్రవరి 1ప్రజా సమస్యల పరిష్కారం కై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్
తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకై, ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ చర్లలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఇంతవరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇచ్చారని, అర్హులైన వారికి ఇవ్వట్లేదరన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని పట్టాలు ఇవ్వలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, లక్ష ఉద్యోగాల హామీని భర్తీ చేయాలని, విద్యార్థుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కినాక బుద్ధి మార్చుకొని ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలేదని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కై 6 గ్యారెంటీల అమలుకై ప్రజలంతా ఐక్యంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిరావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీమా సమ్మక్క, నందు తదితరులు పాల్గొన్నారు.