రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణాలు ,ఇతరుల తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ - డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, గౌరవ ఛైర్పర్సన్ వారి నేతృత్వం లో - కేసు నెంబర్.7141/2025) నమోదు చేసుకుంది. వార్త కదనాలల్లో ఆరోపించబడిన - రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ - రవాణా, హోం, గనులు భూగర్భశాస్త్రం, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీ ఆర్టీసీ శాఖల నుండి సమగ్ర నివేదికలు తేదీ 15.12.2025 ఉదయం 11.00 గంటల లోపు సమర్పించాలని ఆదేశించింది.