మరణంలోనూ భర్తకు తోడుగా వెళ్లిన భార్య

Aug 16, 2024 - 16:36
 0  4
మరణంలోనూ భర్తకు తోడుగా వెళ్లిన భార్య

కొత్తగూడెం జిల్లా: ఆగస్టు16:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. 

మణుగూరులో నివాస ముండే కొమ్ము సోమయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పొలం లోనే కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచాడు. 

మధ్యాహ్నం దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కొమ్ము శంకరమ్మ, అతని కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇంటికి సోమయ్య మృతదేహం చేరుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.

భర్త సోమయ్య మృతి చెందడంతో తట్టుకోలేని శంకరమ్మ నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. వెంటనే బంధవులు ఆమెను హాస్పిటల్‌కు తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్ తెలిపారు. 

దుఃఖంలో ఉన్న ఆ కుటుం బం మరింత కుంగిపోయిం ది. వీరికి ముగ్గురు కుమా రులు అంతా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మణుగూరు లో అంటూ వ్యవసాయ పనులు చూసు కునే దంపతులు ఇద్దరు ఇలా గంట వ్యవధిలోనే చనిపోవడంతో అందరిని కలచివేసింది.

ఒకరి తరువాత ఒకరు వృద్ధ దంపతులు మృతిచెందడం తో ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయిం ది. ఎంతో అన్యోన్యంగా ఉండే సోమయ్య – శంకర మ్మ దంపతుల మృతితో వారు నివాసముండే, బాలా జీ నగర్ లో విషాదఛాయ లు అలుముకున్నాయి, 

వృద్ధ దంపతుల మృత దేహాలను చూసి బంధు వులు, స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333