యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...... వేమూరి

మునగాల 20 ఆగస్టు 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :హ
జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నా, యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా సకాలంలో. అవసరమైన మేరకు రైతులకు యూరియా అందించడంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అధికారులు విఫలమయ్యారు. అని .. ముందు గానే. వర్షాలు పడి. ఆయా. ప్రాజెక్టు లు. చెరువులు కుంటలు నిండి. రైతులు వ్యవసాయ పనులు. మొదలు పెట్టినా. ప్రభుత్వానికి. ముందస్తు ప్రణాళిక లేక పోవడం. సరైన సమయానికి. అవసరమైన మేరకు నిల్వ చేయక పోవడం. బాధాకరం అని మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్,వేమూరి సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సొసైటీల్లో ఒక బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డీలర్లు యూరియా పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు సొసైటీల్లో రైతులకు సరిపడా యూరియాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. . రైతులకు మూడు నాలుగు గ్రామాల వారికి వారి పరిధిలో ఉన్న. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఉన్న. కేంద్ర లో. మాత్రమే. ఏర్పాటు చేయడం బాధాకరం అని. రైతుల ఇబ్బందులు తొలగింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని. తక్షణమే ప్రభుత్వం. సంబంధిత అధికారులు. అవసరమైన మేరకు. ప్రతి గ్రామానికి యూరియా సప్లై చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు .