గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందిన శ్రీరాముల ఝాన్సీరాణి
అడ్డగూడూరు 20 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ మంగళవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84 కన్వెన్షన్ డాక్టరేట్ పట్టాల ప్రధాన కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మమైన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 84 కన్వెన్షన్ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు ఇస్రో చైర్మన్ డాక్టర్"నారాయణ చేతుల మీదుగా పి.హెచ్.డి పట్టా తీసుకున్న అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రాగూడూర్ గ్రామానికి చెందిన డాక్టర్" శ్రీరాముల ఝాన్సీరాణి చిన్నతనం నుండి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉన్న పి.హెచ్.డి.పట్టా అందుకోవడం గ్రామానికి ఆదర్శం అని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.పట్టా అందుకున్న రాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు పలువురు తెలిపారు.