పెండింగ్ లో ఉన్న పాఠ్య పుస్తకాలు వెంటనే విడుదల చేయాలి. SFI డిమాండ్ 

Sep 18, 2024 - 19:40
 0  1

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న పార్టీ పుస్తకాలన్నీ విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ నర్సింగ రావు గారికి  వినతిపత్రం సమర్పించారు 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయనీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందకుండా వారి చదువు ఎలా సాగుతుందని ప్రశ్నించారు గట్టు జూనియర్ కళాశాలలో సైన్స్ చదివే విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేదని అదే విధంగా ఐజ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం అర్థశాస్త్రం వృక్ష శాస్ర పుస్తకాలు రాలేదని దాదాపు 60 శాతం  ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వాణిజ్య శాస్ర పుస్తకాలు రాలేదని MPC ఆంగ్ల మాధ్యమా పుస్తకాలు కొరతగా ఉన్నాయని జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో 30 శాతానికి పైగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు అందులో ప్రధానంగా సైన్స్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదని బాలుర జూనియర్ కళాశాలలో మొదటి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఒక్క ఆంగ్ల మధ్యమ పాఠ్య పుస్తకాలు అందలేదని గత సంవత్సర విద్యార్థుల పాఠ్య పుస్తకాలతో కాలం వెళ్లడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికంగా ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క కళాశాలకు విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాలేదని ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించకుండా నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చదివే విద్యార్థులకు ఇంజనీరింగ్ వైద్య విద్య లో చేరేందుకు EAPCET NEET JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయనీ,పాఠ్య పుస్తకాలే అందుబాటులో లేకుంటే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు విద్యా సంవత్సరం  ప్రారంభంలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంటే కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల భవితవ్యం ఏమిటని నిలదీశారు తక్షణమే పెండింగ్ లో ఉన్న పాఠ్య పుస్తకాలు విడుదల చేయడమే కాక నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తెలుగు ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కన్వీనర్ ప్రశాంత్ విద్యార్థులు రియన్ కార్తీక్ నరేష్ అజయ్ మజిల్ మొగిలి  తదితరులు పాల్గొన్నారు 
ధన్యవాదాలతో
భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) 
జోగులాంబ గద్వాల జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333