తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసనకు దిగివచ్చిన కేంద్రం...... తక్కెళ్ళపాటి సాయి

మునగాల 20 ఆగస్టు 2025
తెలంగాణ వార్త ప్రతినిధి:-
*తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట...*
*ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాంగ్రెస్ ఎంపీలు సాధించిన విజయం-మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి...*
*ఒకటి రెండు రోజుల్లో తెలంగాణకు చేరుతాయని 14వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర అంగీకారం...*
*వారం రోజుల్లో తెలంగాణకు సరఫరా కానున్న యూరియా...*
*తెలంగాణ రాష్ట్రం కు 62వేల మెట్రిక్ టన్నుల* యూరియా కేంద్రం కేటాయించడం పట్ల *మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి హర్ష వ్యక్తం చేశారు...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంకు కేటాయించాల్సిన వాటా ప్రకారం యురియా కేటాయించకపోవడంతో గత రెండు రోజులుగా *దేశ పార్లమెంట్* ఆవరణంలో *తెలంగాణ రాష్ట్రం* కు చెందిన *కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరియు ఏఐసిసి అగ్ర నాయకురాలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి శ్రీ ప్రియాంక గాంధీ గారు* తక్షణమే యూరియా కేటాయించాలని చేస్తున్న నిరసనకు దిగివచ్చి నేడు 62వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు అంగీకరిస్తున్నట్లు కేంద్ర స్పష్టం చేసింది అని వారం రోజుల్లో యూరియా తెలంగాణకు సరఫరా కానున్నది అని ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీల విజయం అని,నాటి నుండి నేటి వరకు రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీని వారు స్పష్టం చేశారు.