పౌర హక్కుల సంఘాన్ని ఆడుకోవడం రాజ్యాంగా విరుద్ధం
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి*
భద్రాద్రి జిల్లా కారుకగూడెం అటవీ ప్రాంతములో ఈ నెల మొదటి వారములో జరిగిన ఎన్కౌంటర్ పై వాస్తవ సంఘటనవివరాలు నిజాలను నిర్ధారణ చేసి తెలుసుకునుటకు, మరియు బాహ్యప్రపంచానికి తెలియచేయుటకు బయలుదేరిన పౌరహక్కులసంఘము నాయకులు 13 మందిని నిజ నిర్ధారణకువెళ్ళానియకుండా మధ్యలో ఆపి అరెస్ట్ చేసి పోలి్స్ స్టేషన్ కి తరలించాడం, ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వహామీ ఇచ్చిన ప్రజాస్వామిక వాతావరణమును ఉల్లంగించడం లొ భాగంగానే నేటి నిజనిర్ధార కమిటి ని అడ్డుకోవడం దీనిని జాతీయ మానవ హక్కుల సంఘము కండిస్తుంది.
పోలీసులు చేసిన ఎన్కౌంటర్ బూటకం కాకపోతే ఎందుకు ఆడుకోవడం, మీరే వారికి తోడుగా వెళ్లి అక్కడ పరిసరాలు చూపించించి , జరిగినవి జరిగినట్లు ప్రజలకు తెలపండి. ఇలా నిర్బంధించడం కరెక్ట్ కాదు , దీనిని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వెంటనే వారిని నిజ నిర్ధారణ కి వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, ప్రజాస్వామిక స్వేచ్ఛను కల్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘము తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ మెంబర్ గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేశారు: