మోత్కూర్ నూతన సీఐ గా వెంకటేశ్వర్లు

తిరుమలగిరి మోత్కూర్ 23 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పోలీస్ స్టేషన్‌కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా సీఐ సి.వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎస్‌బీలో విధులు నిర్వహించిన ఆయన తాజాగా బదిలీపై మోత్కూర్‌కి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజలతో సన్నిహితంగా ఉండే విధంగా శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ న్యాయం జరిగేలా చూస్తానన్నారు.ఇదిలా ఉంటే, ఇక్కడ గతంలో ఎస్ఐగా పనిచేస్తున్న బి.నాగరాజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీఐగా వెంకటేశ్వర్లును నియమించారు.....