మన ఊరు మన యాపారం మోత్కూరులో మార్వాడీ వ్యాపారాలకు నిరసనగా ర్యాలీ

Aug 22, 2025 - 23:34
Aug 22, 2025 - 23:35
 0  195
మన ఊరు మన యాపారం మోత్కూరులో మార్వాడీ వ్యాపారాలకు నిరసనగా ర్యాలీ

మోత్కూర్ 22 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శుక్రవారం ఓయూ జేఏసీ పిలుపు మేరకు “మన ఊరు – మన దుకాణం” నినాదంతో మార్వాడీల వ్యాపారాలపై వ్యతిరేకంగా స్థానికులు వ్యాపారులు నిరసన ర్యాలీని చేపట్టారు. స్థానిక వ్యాపార సంఘాలు అందరు కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి,అంబేడ్కర్ చౌరస్తా వద్ద గుమికూడి నినాదాలు చేస్తూ, నిరసన ర్యాలీ తీశారు. మన వ్యాపారాలను ప్రోత్సహించాలని మార్వాడి వ్యాపారాలను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభం జరిగిన కొద్దిసేపటికి పోలీసులు చేరుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసే అనుమతులు లేవని ర్యాలీని అడ్డుకొని వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు మాట్లాడుతూ, మన ఊరు మన వ్యాపారం నినాదం తోనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. వారి వ్యాపారాల వల్ల మా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. స్థానిక వ్యాపారులు జిఎస్టి బిల్లుతో వ్యాపారం చేస్తుంటే మార్వాడి వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జిఎస్టి, లేకుండా బిల్లులు ఇవ్వకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మార్వాడీల వలన స్థానిక వ్యాపారులు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని, మన ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. అందుకే మన ఊరు – మన దుకాణం కోసం మేము పోరాడుతున్నాం అని, వారు తెలిపారు.అయితే, పోలీసులు ప్రజా శాంతి భద్రతలు కాపాడటమే తమ ధ్యేయమని, ఎవరి భావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మొబైల్, క్లాత్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, హార్డ్వేర్ & సిమెంట్, కిరాణం యూనియన్లు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.