డా .S.A సంపత్ కుమార్ కి ఘన స్వాగతం. 

Sep 6, 2024 - 20:19
Sep 6, 2024 - 20:25
 0  28

కాంగ్రెస్ జెండాలతో సంపత్ కుమార్ జిందాబాద్ అనే నినాదాలతో మార్మోగిన ఎర్రవల్లి:-

జోగులాంబ గద్వాల 6 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి .
చౌరస్తా గురించి భారీ ర్యాలీగా  సంపత్ కుమార్ కి స్వాగతం పలికిన అశేష జన వాహిని. 
నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చతిస్గడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎన్నికైన సందర్భంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు.   
ఈ సందర్భంగా ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంపత్ కుమార్  మాట్లాడుతూ. 
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుంది అని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి  కష్టపడ్డా ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. 
మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా అన్ని వర్గాల వారిని సమన్వయం చేస్తూ జరిగిందని అలాగే రాబోయే కాలంలో ఏర్పాటు చేసే ప్రతి ఒకటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వేస్తామని ఆయన అన్నారు. 
రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని వారి ప్రమేయంతోనే గ్రామస్థాయిలో జరిగే లేదా ప్రజలకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతాయి అని ఆయన అన్నారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు అభిమానులు సంపత్ కుమార్ ని శాలువాలు పూలమాల తో సత్కరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333