**యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలి""కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి*
యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి.
వ్యాపార వాణిజ్య సంస్థల ఏర్పాటు తో పట్టణ అభివృద్ధి.
వ్యాపార వాణిజ్య రంగాల్లో కోదాడ ను అగ్రస్థానం లో నిలపాలి.
నగరాలకు ధీటుగా హోటల్ అండ్ రెస్టారెంట్.
మెరుగైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ .సూర్యాపేట జిల్లా :
యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోనీ హుజూర్ నగర్ రోడ్డు లోని పాత సాయి బిందు రెస్టారెంట్ బిల్డింగ్ లో నిర్వహకులు నడిగూడెం మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. రెస్టారెంట్ యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి నిరుద్యగులకు జీవన భృతి కల్పించాలన్నారు. వ్యాపార వాణిజ సంస్థల ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు.జీవీకే ఫ్యామిలీ హోటల్ అండ్ రెస్టారెంట్ యజమానులు నాణ్యమైన ఆహార పదార్థాలు, సేవలు అందజేసి పేరు గడించాలన్నారు. నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరాలకు ధీటుగా రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్నేని బాబు, చందర్రావు, ముత్తావరపు పాండురంగారావు, లక్ష్మీనారాయణ రెడ్డి, దేవ బత్తిని రమేష్, గడ్డం మల్లేష్ యాదవ్, బూతుకూరి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.