KGBV పాఠశాలల్లో అర్హులైన బాలికలకు వెంటనే సీట్లు కేటాయించాలి

Jun 22, 2026 - 19:38
 0  8
KGBV పాఠశాలల్లో అర్హులైన బాలికలకు వెంటనే సీట్లు కేటాయించాలి

RCO కి TNSF,PDSU, USFI, వినతి.

 22 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన బాలికలకు వెంటనే సీట్లు కేటాయించాలని PDSU జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రాంతీయ సమన్వయ అధికారి (RCO) కి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా PDSU, USFI, TNSF నాయకులు మాట్లాడుతూ, పేద, అనాథ, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు, బడి బయట ఉన్న బాలికలు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు, రాజకీయ జోక్యాలు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.

KGBV పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల పేద బాలికలకు విద్యా అవకాశాలను కల్పించే ముఖ్యమైన విద్యాసంస్థలని, అర్హులైన ఒక్క విద్యార్థిని కూడా విద్యకు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేసి అర్హులైన విద్యార్థినులకు న్యాయం చేయాలని PDSU నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో  TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్, PDSU జిల్లా అధ్యక్షులు హాలింపాషా,USFI రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్ పల్లి రంగస్వామి  చందుపషా, తిరుమలేష్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333