నిరుద్యోగులకు శుభవార్త

Oct 22, 2025 - 13:49
Oct 22, 2025 - 18:45
 0  148
నిరుద్యోగులకు శుభవార్త

 తిరుమలగిరి 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : ఈ నెల 25 న హుజుర్నగర్ లో జరిగే జాబ్ మేళా ను వినియోగించు కోవాలని తహసీల్దార్ తిరుమలగిరి బాశెట్టి హరిప్రసాద్  కోరారు బుధవారం తహసీల్దార్ కార్యాలయం లో యువజనులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ  మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి  హుజుర్నగర్ లో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ మరియు తెలంగాణా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సంజ్ సహకారంతో 150 ప్రైవేట్ సంస్థ ల తో 2000-5000 మందికి ఉద్యోగఅవకాశం కల్పిస్తున్నట్లు తెల్పినరు, పదవ తరగతి పాస్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ పీజీ ఫార్మసీ చదివిన వారు, 18-40 సంవత్సరాల వారు అర్హులు అని తెలిపినారు 25 అక్టోబర్ రోజున పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ హుజుర్నగర్ లో హాజరు కావాలని కోరారు, ఈ కార్యక్రమం లో డీటీ జాన్ మహమ్మద్, ఆర్ ఐ లు జార్జి రెడ్డి, సుజిత్ రెడ్డి లు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి