మేడి నరసమ్మ జ్ఞాపకార్ధంగా చలివేంద్ర ప్రారంభం

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ చలివేంద్రం ప్రారంభం. ఆత్మకూర్ ప్రజా సౌకర్యార్థం ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మండల తహసిల్దార్ శ్రీ హరి కిషోర్ శర్మ అన్నారు. మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడి నరసమ్మ జ్ఞాపకార్థం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దహార్తిని తీర్చేందుకు తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చలివేంద్రాన్ని కార్యాలయానికి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడి ముత్తయ్య, మేడి కృష్ణ, ఎంపీడీవో హసీం, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత భూపతి రాములు, డిప్యూటీ తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్,ఎంపీఓ రాజేష్ గౌడ్, వెంకటాచారి, తదితరులు ఉన్నారు.