మున్సిపాలిటీలో చెత్త’శుద్ధి ఏదీ...?
మున్సిపాలిటీలో పేరుకుపోతున్న చెత్త....
పలు వార్డులకు మున్సిపల్ సేవలు కరువు...!
చెత్తచెదారం కదలడం లేదు. ... !
ఎక్కడ పడితే అక్కడే....
పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు... !
తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పలు వార్డుల్లోని చెత్త పేరుకుపోవడం అనేది పారిశుధ్య లోపం వల్ల జరుగుతుంది, దీనివల్ల రోడ్లు, కాలువలు అపరిశుభ్రంగా మారుతున్నాయి దీనివలన, దుర్వాసన వస్తుంది, డ్రైనేజీ కాలువల చెత్త తీయడం లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు వీటివల్ల విపరీతంగా దోమలు, ఇతర తెగుళ్లు వృద్ధి చెందుతున్నాయి, ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఈ పరిస్థితికి ఎందుకొచ్చిందంటే చెత్త సేకరణ లేదు వాహనాలు సక్రమంగా నడపడం, లేదు పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేయడం, లేదు మరియు ఎన్నోసార్లు అధికారులకు విన్నయించుకున్న మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫలితం లేదు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయక పోవడంతో సమస్య అధికమైందని పట్టణ వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సైతం డ్రైనేజీల వద్ద చెత్త చెదారం పేరుకు పోయి ఎక్కడికక్కడ మురుగు నీరు రోడ్డు పైకి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలు కావలి శుభ్రపరచలని పలు వార్డుల ప్రజలు కోరుతున్నారు
ఎవరిది నిర్లక్ష్యం...?
మున్సిపాలిటీలలో చెత్త పేరుకుపోవడం అనేది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడం, మరియు సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, చెత్తను సరిగ్గా సేకరించి, వివిధ పద్ధతులలో ప్రాసెస్ చేయడం అవసరం
ప్రతి వీధిలో .....
చెత్త పేరుకుపోయిందని స్థానికులు వాపోతున్నారు. పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని ఎన్నిసార్లు చెప్పినా మునిసిపల్ సిబ్బంది స్పందించడం లేదన్నారు. పన్నుల వసూళ్లలో చూపించే శ్రద్ధ పారిశుధ్యం పై చూపించాలని వారు కోరుతున్నారు. చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తక్షణమే పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని కోరుతున్నారు.