ఛలో విద్యుత్ సౌత్ ఎస్సి ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా 

Aug 20, 2024 - 18:34
Aug 20, 2024 - 18:34
 0  11
ఛలో విద్యుత్ సౌత్ ఎస్సి ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా 

మెరిట్ కం సీనియర్టీ విధానం రద్దు చేయాలి! 
వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంల దుర్గయ్య 

అడ్డగూడూరు 20 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా, డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 21-08-2024 న తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ విద్యుత్ సంఘం అధ్యక్షులు శ్యాం మనోహర్, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్ పిలుమేరకుమహా ధర్నా ఛలో విద్యుత్ సౌధ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు ఏంఆర్ రవీందర్ ప్రధాన కార్యదర్శి బోట్ల రాజేశ్వర్ భువనగిరి డివిజన్ అధ్యక్షులు జైపాల్ వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంలదుర్గయ్య,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఎస్సి ఎస్టీ విద్యుత్ ఉద్యోగులకు పిలుపు నిచ్చారు వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎస్సి ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పిస్తే ఓసిబీసీ సంఘం నాయకులు దళితులు అత్యున్నత స్థానాలకు వెళ్లుచున్నారు అని ఓర్వలేక కుట్రలు పన్ని మనకు అన్యాయం చేస్తున్నారు కాబ్బట్టి ఇలాంటి దుర్మార్గపు చర్యలను తిప్పకొట్టడానికి  విద్యుత్ సౌధ వద్ద 21-08-2024 బుధవారం రోజున మహా ధర్నా చెప్పట్టడం జరిగింది అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు మా పోరాటం ఉంటుంది అని అన్నారు.మా రాష్ట్ర నాయకత్వం అధ్యక్షులు శ్యాం మనోహర్ సెక్రటరీ జనరల్ మేడి రమేష్ లు ఎలాంటి పిలుపు ఇచ్చిన డానికి కట్టుబడి యాదాద్రి భువనగిరి జిల్లా డివిజన్ నాయకత్వం పనిచేస్తుంది అని అన్నారు. కాబ్బట్టి ఎస్సి ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ మహానగరంలో దళిత ఉద్యోగుల సత్తా చాటాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333