సూర్యాపేటలో చలివేంద్రం – ఉచిత కూరగాయల పంపిణీ

Mar 6, 2026 - 20:44
Mar 6, 2026 - 20:51
 0  5
సూర్యాపేటలో చలివేంద్రం – ఉచిత కూరగాయల పంపిణీ
సూర్యాపేటలో చలివేంద్రం – ఉచిత కూరగాయల పంపిణీ

సూర్యాపేట, 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో కెల్షిత చలివేంద్రం మరియు ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని 6వ వార్డు కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రెటరీ ధరావత్ రెడ్డి నాయక్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ........... మగతాల క్రాంతి మరియు శ్రావణి ప్రతి సంవత్సరం ఇలాంటి చలివేంద్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ బాటసారుల దాహం తీర్చడం చాలా అభినందనీయమని అన్నారు. అలాగే పాఠశాలల విద్యార్థులకు మరియు పేద ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో మంచి సేవా కార్యక్రమమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 300 మందికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల నుండి మంచి స్పందనను పొందింది. ఈ కార్యక్రమంలో యాదస్సు నిర్మయ - యాదస్సు పుష్ప, దుబ్బ రమేష్, బంక వెంకన్న, ఈసంపల్లి సాయి చరణ్, సుభద్ర, శ్రావణి, భవాని తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333