99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Mar 6, 2026 - 20:21
Mar 6, 2026 - 20:23
 0  5
99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

99 రోజుల కార్యక్రమం పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలేంల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  తెలిపారు 

శుక్రవారం బాలేంల గ్రామపంచాయతీ  కార్యాలయంలో  99 రోజుల కార్యక్రమం అమలు పై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

సూర్యాపేట 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ నూతనంగా గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు  ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.  పెండింగ్ ఫైల్స్ క్లియర్, త్రాగునీరు, విద్యా, వైద్యం పై వచ్చిన దరఖాస్తులు పది రోజులలో క్లియర్ చేయాలని కలెక్టర్ అన్నారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గోన్నాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పేద ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ  ముఖ్య ఉద్దేశమని  తెలిపారు.

 బాలేంల గ్రామంలో ప్రజలతో కలెక్టర్ ముచ్చటించారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్డు, స్టోర్ రూమ్, వంటశాల, కంప్యూటర్ రూమ్ ల్యాబ్ పరిశీలించారు, స్కూలుకు సంబంధించిన బిల్లులు ఆన్లైన్లో ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు  10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మంచి మార్కులు తెచ్చుకోవాలని,  ప్రతి సబ్జెక్టులో నూటికి 70 శాతం మార్కులు రావాలని కలెక్టర్ కోరారు.

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల భోజన వసతులు అడిగి తెలుసుకున్నారు, పల్లె దావఖానాలో ఏ ఎన్ ఎం లతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డిఓ వేణు మాధవరావు, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీఓ లింగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాదు, ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333