మున్సిపల్ కార్మికులకు బకాయి జీతాలు పీఎఫ్ ఈఎస్ఐ వెంటనే ఇవ్వాలనీ కమిషనర్ కు వినతిపత్రం
స్పందించిన కమిషనర్ వెంటనే పరిష్కరిస్తామని హామీ.
జోగులాంబ గద్వాల 6 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు ఎలక్ట్రిషన్ వర్కర్లు వాటర్ వర్కర్లు ఆఫీస్ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉగాది పండుగ ఉన్నందున మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని బకాయి ఉన్న పీఎఫ్ ఈఎస్ఐ వెంటనే జమ చేయాలని వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున కార్మికులతో ఒక పూటనే పని చేయించాలని సబ్బులు నూనెలు డ్రస్సులు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎం రాజేష్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం ఇచ్చారు.కమిషనర్ స్పందిస్తూ రెండు నెలల జీతాలు వెంటనే ఇస్తామని రెండు నెలల పిఎఫ్, ఒక నెల ఈఎస్ఐ, జమ చేస్తామని మిగిలిన పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు విడతల వారిగా జమ చేస్తామని ఎండలు ఎక్కువగా ఉన్నందున కార్మికులతో ఒక పూట పని చేపిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ .వెంకటస్వామి జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేరు నరసింహ, సభ్యులు రవి, రాము, బాలరాజు, జవాన్ పాండు తదితరులు పాల్గొన్నారు.