CM రేవంత్ బెదిరిస్తున్నారని రైతుల ఆవేదన: BRS.
హైదరాబాద్ కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని CM రేవంత్, ఆయన సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు KTRను కలిశారు. దుద్యాల్ మండలంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు KTRకు వివరించినట్లు BRS ట్వీట్ చేసింది. భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు చెప్పారని, వారికి అండగా ఉంటామని KTR హామీ ఇచ్చారని పేర్కొంది...