తాగునీటి సమస్యలు తలెత్తకుండా మందస్తు చర్యలు: జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

Apr 6, 2024 - 19:19
 0  20
తాగునీటి సమస్యలు తలెత్తకుండా మందస్తు చర్యలు: జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

జోగులాంబ గద్వాల 6 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల కలెక్ట్రేట్ జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా మందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సంబంధిత  అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని  కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ తో కలిసి ప్రస్తుత పరిస్థితిలో త్రాగునీటి సరఫరా అంశంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన గత వారం జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల పట్ల చేపట్టిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు అందరూ ప్రతిరోజు నాలుగు గ్రామాలను సందర్శించి ఎల్లో జోన్, ఆరెంజ్ జోన్ వివరాలను అందజేయలన్నారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా గ్రామాలలో ప్రత్యమ్నయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతి పంపులు బోరు మోటార్లు, పైప్ లైన్ ల మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని వచ్చే రెండు నెలలు ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు తరతకుండా చూడాలని సూచించారు.


     ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, జెడ్పి సీఈవో కాంతమ్మ, డిఆర్డిఓ నర్సింగరావు, డిపిఓ వెంకట్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333