కొండేరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బిజెపి నాయకులు

Nov 20, 2025 - 15:45
 0  23

జోగులాంబ గద్వాల్ 20 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఎర్రవల్లి. మండలం కొండేర్ గ్రామం  బీజేపీ మండల అధ్యక్షలు జగదీష్ రెడ్డి ఆదర్యం లొ కొండేర్ వడ్లు కొనుగోలు  కేంద్రం ikp  సెంటర్ ను సందర్శించడం జరిగింది. ఇ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు  రావడం జరిగింది .  జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు  మాట్లాడుతూ ఐకెపి సెంటర్లలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ . రైతులు పండించిన వరి ధాన్యాన్ని  వడ్ల కొలుగోలు చేయడ జరుగుతుంది.

 రైతులు తమ వడ్లని  తేమ 17 %శాతం లోపల  ఆరబెట్టుకొని వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు రేటు 2389  రూపాయలు a గ్రేడ్ రకానికి  సాధారణ రకం వడ్లకు  2369 రూపాయలు నరేంద్రమోడీ   చెలిస్తున్నారు. రైతులుకు వడ్లు కు గొనె సంచులు సుతులి హమాలీ చార్జీ కేంద్రమే భరిస్తుంది.. అదే విధంగా ikp సెo టర్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో  కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ  వడ్లు కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ లేకుండా ఫ్లెక్సీలలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం  వారి ఫోటోలు వారి నాయకుల ఫోటోలు పెట్టుకోవడం చాలా దారుణం అన్నారు. వెంటనే ఆ ఫ్లెక్సీలలో నరేంద్ర మోడీ ఫోటో ఉండేటట్లు ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టుగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  కేకే రెడ్డి ఎగ్ బోట్ రవి  బీజేవైఎం బిసన్న  కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333