మాతృ మరణాలపై వైద్య ఆరోగ్యసిబ్బందికి సమీక్ష సమావేశం కలెక్టర్
జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల తేదీ.26.7.2025 న, జిల్లా కలెక్టర్ ,B M. సంతోష్ , అధ్యక్షతన, గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన "" మాతృ మరణాల "" పై, వైద్య సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు... ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. ఎస్కే సిద్దప్ప మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా కూడా మాతృ మరణాలు జరగకుండా వైద్య సిబ్బంది,ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పని చేయాలని లేనిచో శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు..
మాతృ మరణాలు జరగకుండా ఉండాలంటే వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు,సమన్వయం చేసుకుంటూ గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు, త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు.. RMP లు ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చినచో అటువంటి RMP లపై క్రిమినల్ కేసు బుక్ చేయమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి ని, జిల్లా కలెక్టర్ ఆదేశించారు..
బింగి దొడ్డి గ్రామంలో, బాలింతకు, డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా RMP ఇంటిదగ్గర ఇంజక్షన్ వేయడం ద్వారా బాలింత మృతి చెందడం వల్ల, ఆ బాలింత మృతికి కారణమైన RMP పై క్రిమినల్ కేసు బుక్ చేయమని కలెక్టర్ , DMHO ని ఆదేశించారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యాధికారులు ఫీల్డ్ సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, హై రిస్క్ లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలను మరియు బాలింతలను తప్పనిసరిగా గృహ సందర్శన చేసి మాతృ మరణాలను అరికట్టాలని ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వైద్య సిబ్బంది కి సూచించారు.. జిల్లా వైద్యాధికారులు, మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బృందం జిల్లాల్లోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ విజిట్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం వారు స్టెర్లైజ్డ్ ఆపరేషన్ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అని చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు..
ఈ సమీక్షా సమావేశంలో మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసూన రాణి, మరియు ఇటిక్యాల ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాధిక మరియు గట్టు ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ మరియు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ B. ఇందిరా మరియు డాక్టర్ నరహరి ఫిజీషియన్, డాక్టర్ లక్ష్మి గణికాలజిస్ట్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, ఆఫీస్ సూపర్డెంట్ ముని ప్రసాద్ తిరుమలేష్ రెడ్డి (ASO), నరసయ్య, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు పాల్గొన్నారు...