వార్షిక తనిఖీల్లో భాగంగా ఆలంపూర్ సర్కిల్ కార్యాలయాన్ని, అలంపూర్,గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ల ను, మరియు జిల్లా పోలీస్ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేసిన
జోగుళాంబ జోన్ డి . ఐ.జి శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ IPS
జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు జోగుళాంబ జోన్ డి.ఐ.జి శ్రీ ఎల్.ఎస్.చౌహన్ IPS కోదండపూర్ లోని ఆలంపూర్ సర్కిల్ కార్యాలయాన్ని, అలంపూర్, గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లను మరియు జిల్లా పోలీస్ కార్యాలయం ను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తో కలిసి సందర్శించి ఆయా స్టేషన్ ల రికార్డ్స్ ను, పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, జిల్లా పోలీస్ కార్యాలయం లో ఆయా సెక్షన్ అధికారుల రికార్డ్స్ ను తనిఖీ చేశారు. అందులో భాగంగా కోదండపూర్ లోని ఆలంపూర్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం డైజెస్టర్ రికార్డు , ప్రభుత్వ ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించేటట్లు ఆయా ఎస్సై ల ద్వారా చర్యలు చేపట్టాలని ఆలంపూర్ సి. ఐ రవి బాబు కు సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. ఆలంపూర్, గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ లను సందర్శించి వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా సిబ్బందితో డి . ఐ.జి మాట్లాడుతూ----- ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల అంచనాలను చేరుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ ల నందు 5S ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవఛ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్థుల ఫై నిఘా పెట్టాలని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయ తనిఖీలు జిల్లా పోలీస్ కార్యాలయ తనిఖీ కి వచ్చిన డి. ఐ. జి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో వివిధ విభాగాలు అయిన SB, DCRB రికార్డులను, A- సెక్షన్, B- సెక్షన్ విభాగాల రికార్డులను, హెడ్ క్వార్టర్స్ కు సంభందించిన ప్లాటూన్ రికార్డ్స్, అడ్మిన్ స్టోరీ రికార్డ్స్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ (ఆయుధాల) రికార్డ్స్ లను, MT సెక్షన్ రికార్డ్స్, హోం గార్డ్స్ రిజిష్టర్ లను మరియు డాగ్ స్క్వాడ్ రికార్డులను మరియు రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయం లో విభాగాల సిబ్బంది పని తీరును ఎస్పీ డి. ఐ. జి కి వివరించారు. కార్యాలయ సిబ్బంది తో మాట్లాడుతు పోలీస్ సిబ్బంది సర్వీస్ కు సంబందించి వచ్చే విన్నపాల ఉన్నతాధికారుల ఆదేశాల పై ఎప్పటికపుడు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్పీ తీసుకుంటున్న చర్యలపై డి . ఐ.జి సంతృపి వ్యక్తం చేశారు. తెలంగాణ వనమాహోత్సవం కార్యక్రమం లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అలంపూర్ సర్కిల్ కార్యాలయం, అలంపూర్ మరియు గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ తో కలిసి మొక్కలు నాటారు.అలాగే ప్రతి పోలిశాఖ భూములలో మరియు పోలీస్ స్టేషన్ అవరణంలో వనమాహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పీ శ్రీ వై. మొగులయ్య , జిల్లా పోలీస్ కార్యాలయ ఏ . ఓ సతీశ్ కుమార్, సాయుధ దళ డి.ఎస్పీ శ్రీ నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆలంపూర్ , గద్వాల్ , శాంతి నగర్ సీఐ లు రవి బాబు, శ్రీనివాస్, టాటా బాబు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు సిసి లోహిత్ రెడ్డి,జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.