మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

Nov 26, 2025 - 05:54
 0  265
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

 తిరుమలగిరి 26 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో స్వయం సహాయక మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పది సంవత్సరాలు వడ్డీ లేని రుణాలను ఇవ్వకుండా మహిళా సంఘాలను పట్టించుకోలేదని ఆరోపించారు.ఇప్పటికే తమ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు దఫాలుగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్రవ్యాప్తంగా సంఘాలలో జమ చేయడం వలన మహిళల్లో ఒక నమ్మకం ధైర్యం వచ్చిందని ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలందరూ మా ఆడబిడ్డలేనని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుoదని గుర్తు చేశారు. మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్‌ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాంట్లు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరలు అలాగే కలెక్టర్‌ నేతృత్వంలో మహిళా సమాఖ్యల ద్వారా ప్రతీ మహిళకు చేరుతాయన్నారు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రజలు, మహిళలు ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. చామంతి నరేష్, డి ఆర్ డి ఓ అప్పారావు, డిపిఎం బెనర్జీ, తహసిల్దార్ హరిప్రసాద్, ఎంపీడీవో లాజర్, ఏపిఎం లు లక్ష్మి, శోభ, అన్ని మండలాల ఏపిఎంలో మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి