జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ సర్కులర్ ప్రకారం ఫీజులో 50% రాయితీ కల్పించాల్సిందే..... బీసీ విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ

Jul 12, 2024 - 16:50
Jul 12, 2024 - 18:05
 0  5
జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ సర్కులర్ ప్రకారం ఫీజులో 50% రాయితీ కల్పించాల్సిందే..... బీసీ విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ

మునగాల 12 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50% ఫీజులో రాయితీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అర్ధరాత్రి అయినా అపరాత్రేన జర్నలిస్టు మిత్రులు సకలజనులు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయిలో చిత్రీకరించి ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్త కథనాలు ప్రచురించి తెలంగాణ బ్రతుకుచిత్రాన్ని ఢిల్లీ స్థాయిలో చూపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులు తమ జీవితాలను త్యాగం చేశారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలతోపాటు పింఛన్ ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని అక్విడేషన్ తో సంబంధం లేకుండా అందరికీ ఫీజులో రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా జిల్లా విద్యాధికారి స్పందించి ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ చాలామంది జర్నలిస్టులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State