వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు:షి టీమ్
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- వేధింపులకు గురిచేసిన, ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ షి టీమ్ బృందం తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల్ పట్టణం లోని విశ్వేశ్వరయ్య మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు టీం సేవల గురించి, వేదింపులకు గురై నప్పుడు షి టీం ను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు మాట్లాడుతూ మహిళలు రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన,ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 8712670312 కు లేదా డయాల్ 100 కు కాల్ చేయాలన్నారు. సమచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయాని తెలిపారు. అలగే వేధింపుల రకాలు, షి టీం ను అప్రోచ్ అయ్యే విధానం ను, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు.విద్యా ఆవశ్యకత గురించి తెలియజేసి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి, పొక్సో కేసుల నమోదు, శిక్షల గురించి వివరించారు. మహిళలు, బాలికలు సురక్షితంగా ఉండుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, షి టీమ్ సభ్యులు దివ్యవాణి, హన్మంతు , లోకేశ్వరీ మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.