మరణించిన పోలీసు కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించిన జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS .
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- రోడ్డు ప్రమాదాలలో మరణిం చిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రితిరాజ్, IPS భద్రత ఎక్స్ గ్రేషియ క్రింద 2,00,000/- రూపాయల ఆర్థికసాయాన్ని అందజేసారు. ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ 2020సంవత్సరం డిసెంబర్ నెల లో, రాజోలి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శంకర్ గౌడ్ 2021 సంవత్సరం జనవరి నెలలో రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు భద్రత ఎక్స్ గ్రేషియ క్రింద ఒక్కొక్క కుటుంబానికి 1,00,000/- (ఒక లక్ష) రూపాయల చెక్ ను జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ ఓ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ. ఓ సతీష్ , సూపరింటెండెంట్ నాగేందర్ , కానిస్టేబుల్ రాజశేఖర్ భార్య జానకమ్మ, కానిస్టేబుల్ శంకర్ గౌడ్ తల్లి తండ్రులు ముణేశ్వరమ్మ , వెంకటన్న గౌడ్ లు పాల్గొన్నారు.