. పరీక్ష ఫలితాల దృష్ట్యా విద్యార్థులు ఒత్తిడిలకు లోను కావద్దు
డిఎంహెచ్ఓ:- డాక్టర్ శశికళ.....
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ * ఈరోజు జిల్లా నందు పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యార్థినిలకు తెలుపు నది ఏమనగా రెండు రోజులలో *ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలుబడుతున్న దృష్ట్యా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే అభద్రత భావాలకి లోను కావద్దని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దని తెలిపారు ఒకవేళ ఫెయిల్ అయితే పట్టుదలతో చదివి సప్లమెంటరీ పరీక్ష నందు పాస్ కావాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు ఒకవేళ మానసిక సమస్యలు ఉంటే టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ (14416) కాల్ కు ఫోన్ చేయాలని వీరు 24 గంటల సదుపాయం కలదని సూచనలు సలహాలు ఇస్తారని తెలిపారు.. అటువంటి వారికి వైద్యులు ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పారు, ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అవసరమని గుర్తిస్తే కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగాన్ని సమరించాలని * డిఎంహెచ్ఓ మేడం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు తెలియజేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు మరియు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్సూద్లు ఉన్నారు.