ప్రపంచo గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి
జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్*
(సూర్యాపేట టౌన్,ఏప్రిల్14) :- ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్ లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు.
విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగము వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ జిల్లా కోశాధికారి పాల సైదులు ,పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి ,పట్టణ ఉపాధ్యక్షులు జానీ నాయక్, ఖమ్మంపాటి అంజయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర చారి ,వాంకుడోత్ సక్రు నాయక్, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, బొమ్మగాని వెంకన్న గౌడ్, పెగ్గే పురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.