మండల సమాఖ్య కార్యాలయంలో ఆరోగ్య శిక్షణ సదస్సు

మద్దిరాల 13 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో మండల సమైక్య కార్యాలలో వివో ఓబి హెల్త్ కమిటీ సభ్యులకు పుడ్, న్యూట్రిషన్ మరియు ఆరోగ్యం మీదా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమానికి మండల ప్రాథమిక డాక్టర్"అమూల్య మాట్లాడుతూ..క్యాన్సర్ మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం పాలు పండ్లు గుడ్లు ఆకుకూరలు తీసుకోవాలని శిక్షణ సందర్భంగా గుర్తు చేశారు.ఐసిడిఎస్ సూపర్ వైజర్,టీఓటి ట్రైనర్ ఏపీఎం రాంబాబుఎం ఎస్, ఏపిఎం మైసయ్య,సి సి నాగార్జున రెడ్డి, రమేష్, సి ఆర్ పి దండే మమత, ఆపరేటర్ సమ్మక్కఎంఎస్,ఓబి లక్ష్మి వి ఓ ఏ తార,శేరి రాధిక, పుష్ప,యాదగిరి,సుమన్,బాలయ్య,అంజయ్య,సభ్యులు ధరావత్ కళావతి,రేణుక, మహిళలు తదితరులు పాల్గొన్నారు.