భువనగిరి ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురపంగా ప్రకాష్

Jul 5, 2024 - 19:40
 0  8
భువనగిరి ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురపంగా ప్రకాష్

భువనగిరి 5 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భువనగిరి మండల కేంద్రంలోని వికలాంగుల హక్కుల కొరకై జిల్లా నాయకులు ఆడియో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది 300, మూడువందలతో వికలాంగులు ఏ విధంగా బ్రతుకుతారు.300 పింక్షన్ 3000 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.మరియు అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని హామీ  వృద్ధులకు వితంతువులకు 4000 వికలాంగులకు 6000 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నది పింక్షన్ పెంపు కోసం 44,49,767 మంది లబ్ది దారులు ఎదురు చూస్తున్నారు. క్రొత్తగా పింక్షాన్ దరఖాస్తు చేసుకున్న 24,84000 లక్షల మందికి ఇప్పటివరకు మంజురు కాలేదు.2014 రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింక్షన్స్ మంజూరుకు ముందు ఆదాయ పరిమితి విధిస్తూ జివో 17 ను విడుదల చేసింది దీనిని వెంటనే రద్దు చేయాలని, 2015 కంటే ముందు సదరన్ సర్టిఫికెట్ పొందిన వారికీ ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం లేదు, 2015 కంటే ఉన్న  సదరన్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి నెల 5 వ తేదీ లోపు పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ కోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి స్వామి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత సాంస్కృత విభాగం  నాయకులు అంజన్ శ్రీ రాధాకృష్ణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333