వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు సభను విజయవంతం చేయాలి

కళాకారుడు గాయకుడు ఏపూరి సోమన్న

Jan 11, 2025 - 22:48
Jan 11, 2025 - 22:49
 0  16
వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు  సభను విజయవంతం చేయాలి

సభను విజయవంతం చేయాలి కళాకారుడు గాయకుడు ఏపూరి సోమన్న 

అడ్డగూడూరు11 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

హైదరాబాదులో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు సభను విజయవంతం చేయాలని డాక్టర్" ఏపూరి సోమన్న అన్నారు.ప్రజల నాయకత్వం బహుజన యుద్ద నౌక పాటల ఉద్యమ శిఖరం డా"ఏపూరి సోమన్న తెలంగాణ రాష్ట్ర మలిదశ తొలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన పాటల ఉద్యమ నాయకుడు

ప్రజల గాయకులు బహుజన యుద్ద నౌక డా " ఏపూరి సోమన్నకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కీలక బాధ్యతలను ఇవ్వకపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే అవమానం గా 

భావించవచ్చు..చిన్నతనం నుండే సమాజ నిర్మాణానికి 

సమాజంలో జరుగుతున్న అన్యాయా అసమానతలను కళ్ళారా చూసి కడుపు మాడిన కుటుంబం నుండి కడుపేద 

జీవితాన్ని అనుభవించే కలకారునిగా కాళ్లకు గజ్జెలు కట్టుకొని భుజాన గోసి గొంగడి 

వేసుకుని సంకన డప్పు వేసుకొని దగపడ్డ తెలంగాణ పల్లె పల్లెకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిరవేర్చ కదిలిన

రథ సారథి సోమన్న

కలం గళం విప్పిన వాగ్గేయ కారులు ఏపూరి సోమన్న

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలను తట్టుకుని నిలబడగలిగిన గాయకుడు

రౌడి రాజకీయ నాయకుల 

బెదిరింపులకు బెదరకుండా

పాటకోసం ప్రాణం పోయిన పర్వలేదు అంటూ ప్రజల పాటగా ప్రజల పక్షం గొంతెత్తి గర్జించి గళాన్ని వినిపించి నిలబడ్డా వాడు ఏపూరి సోమన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే 

లేనప్పుడు ఒక్కడే ఒంటరిగా ప్రతిపక్షం అనే పాటను తన నెత్తిన పెట్టుకొని పాలకుల

గుండెల్లో గుబులు పుట్టించే పాటలను రాసి ప్రజలకు ప్రతి పక్షంగా నిలిచిన ధిక్కార విప్లవ ఉద్యమ కెరటం బహుజన యుద్ద నౌక ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవను అందించిన

అభ్యుదయ వాది ఏపూరి సోమన్న పదవులు అధికారం ఉన్నలేకున్నా బహుజన యుద్ద నౌక డా"ఏపూరి సోమన్న పాట

ప్రజల వారసత్వం ప్రజల నాయకత్వం ప్రజలకై పోరాడే వీరత్వం సమస్య వచ్చిన ప్రతిచోటా పాటతత్వం 

ఆకలి చావులు మధ్య 

అవమానాలను భరించి 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో

అక్రమ కేసులకు సైతం తలవంచక

జైల్ నిర్బంధాలను తట్టుకుని తలవంచక నీతిగా నిజాయితీగా నిఖార్సైన తెలంగాణ 

ఉద్యమాన్ని ఉధృతం చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు నేటితరం నాయకత్వాన్ని నడిపే

నాయకుడు సోమన్న పదవులు అధికారం ఉన్న లేకపోయినా

ప్రజలకోసం పాటతో ప్రశ్నించ కదిలే సాయుధ సమరమే 

బహుజన యుద్ద నౌక

డా"ఏపూరి సోమన్న అని పలువురు అన్నారు.