భారత్ మాల అక్రమ మైనింగ్ పగలు బ్లాస్టింగ్ రాత్రి మైనింగ్ చీకటి వ్యవహారంగా నడుపుతున్న

భారత్ మాల వ్యవహారం

Sep 7, 2024 - 18:45
 0  4
భారత్ మాల అక్రమ మైనింగ్ పగలు బ్లాస్టింగ్ రాత్రి మైనింగ్ చీకటి వ్యవహారంగా నడుపుతున్న
భారత్ మాల అక్రమ మైనింగ్ పగలు బ్లాస్టింగ్ రాత్రి మైనింగ్ చీకటి వ్యవహారంగా నడుపుతున్న

అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ పై అక్కడే దీక్ష సాగుతుంది....

అడిగే వాళ్ళ పైన బెదిరింపులు బెదిరించే వాళ్లపైన దాడులు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నటువంటి భారత్ మాల్ మైనింగ్ దందా.

జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  వడ్డేపల్లి. మండలంలో గత కొద్దిరోజులుగా భారత్ మాల్ రోడ్ నిర్మాణం కొరకు అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా భారత్ మాల్ యజమాన్యం పగటిపూట బ్లాస్టింగ్ రాత్రిపూట లోడింగ్ గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం అయితే ఈ వ్యవహారాలు పట్ల తాసిల్దారు కూడా ఎలాంటి పర్మిషన్ లేవని చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్పడంతో ఈ ఇల్లీగల్ దందా చాలా రోజులుగా నడుస్తున్నట్టు సమాచారం ప్రభుత్వ పర్మిషన్ లేకుండా బాంబ్ బ్లాస్టింగ్లు జరుపుతున్నారు పక్కనే వ్యవసాయ పొలాలలో ఉన్న రైతుల కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇవేవీ భారత్ మాల వాళ్లు పట్టించుకోకుండా 30జెసిపిలు దాదాపుగా 60 ట్రిప్పర్లు 20బ్లాస్టింగ్ మిషన్తో చీకటి వ్యవహారంగా నడుస్తున్నటువంటి ఈ భారత్ మాల్ వ్యవహారం ఇక్కడ చూస్తున్న వీడియోలు దాదాపుగా కొన్ని కోట్లకు ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా వ్యవహరించినటువంటి ఈ భారత్ మాల్ రోడ్ వ్యవహారంపై అడగడానికి వెళ్లిన కొంతమందిని దౌర్జన్యాలకు  అక్కడున్నటువంటి లారీ డ్రైవర్లు కానీ జెసిబి డ్రైవర్లు దాడులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు అడిగిన వారిపై దాడులు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అయితే ఈ వ్యవహారం అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వడ్డేపల్లి మండలంలో ఉన్నటువంటి గట్టుపై విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు అందరికీ హబ్బరపరిచేలా కనిపించాయి అయితే అక్కడే ఉన్నటువంటి కొన్ని జెసిపిలను లారీలను పోలీస్ అధికారులు తరలిస్తున్నట్టు సమాచారం అయితే సంపత్ కుమార్  మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా భారత్ మాత రోడ్డు నిర్మాణానికి ఎలా మైనింగ్ జరుపుతారని అక్కడే దీక్ష చేస్తున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333