భాద్యతయుతంగా విధులు నిర్వహించాలి
FST, SST టీం లో హాజరు కానీ వారిపై చర్యలు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
జిల్లా లోని FST,SST కేంద్రాలను పరిశీలించటానికి అలాగే వాస్తవ పరిస్థితి ని జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందచేయుటకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు నియమించటం జరిగిందని, కేంద్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే అక్కడే ఆ కేంద్రంలో ఉన్న బృంద ప్రతినిధి కి నివృత్తి కై తెలియజేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు
అదేవిధంగా నియమించిన అధికారులు FST, SST కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేసి నివేదికలను అదనపు కలెక్టర్ , RDO, DSP లకు అందచేయాలని అలాగే మూడు విడతలలో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా హాజరు కాకపోయినా,సరైన రీతిలో తనిఖీలు చేపట్టకపోయినా ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.