బిసి 42% బిల్లు అసెంబ్లీలో ఆమోదించటం హర్షించదగ్గ విషయం
విన్నపం ఒక పోరాటం లీలావతి చీకురి

హైదరాబాద్ 31 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గౌరవ BC జనరల్ సెక్రటరీ నందగోపాల్ నిర్వహించిన BC ల యుద్ధభేరి ముఖ్యసమావేశంలో పాల్గొన్న విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మాట్లాడుతూ
నేడు స్థానిక సంస్థలలో BC లకు 42% రిజర్వేషన్లు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు..
BC లకు రాజ్యాధికారం కోసం 42% రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా ఎంతోమంది BC లకు రాజ్యాధికారం వస్తుంది.
స్థానికసంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా BC లకు ఇదేవిధంగా పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా BC టైగర్ జాతీయ అధ్యక్షులు R కృష్ణయ్య ఎమ్మెల్సీ, శ్రీ బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, CPI పార్టీ నాయకులు నారాయణ, ఇతర BC ముఖ్య నాయకులు పాల్గొన్నారు.