ఐ . సి .డి .ఎస్ ను విద్య వ్యవస్థను నిర్ణయం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు సహించేది లేదు
రాష్ట్ర సీఐటీయూ ,అంగన్వాడి యూనియన్ నాయకులు

ఐ.సి.డి.ఎస్ ను విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు సహించేది లేదు...
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ల : ప్రీ ప్రైమరి పిఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాబోధన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సిఐటియు, అంగన్ వాడి యూనియన్ నాయకుల కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఐసిడిఎసను బలోపేతం చేయాలి. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి. విద్యా బోధనా బాధ్యతను అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలని సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జర్గింది.
ధర్నా ను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్ష , కార్యదర్శిలు తుమ్మ విష్ణు వర్దన్ , కళ్యాణం వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ తో పాటు విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చింది. ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ రాష్ట్ర | ప్రభుత్వం దీనికి భిన్నంగా ఐసీడీఎస్ ను మొత్తం నిర్వీర్యం చేసే పద్ధతిలో వేటిని అమలు చేయాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో 5 సంవత్సరాలలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి. విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలి. అదనపు వేతనం తదితర సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
6 సంవత్సరాల లోపు పిల్లలకందించే ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదు. ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీ విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైందిగా లేదు. ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ప్రభుత్వంలో భాగమైన అతి ముఖ్యమైన 6 సంవత్సరాల లోపు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర | పోషిస్తున్న ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు కావాల్సింది విద్య ఒక్కటే కాదు. విద్య కంటే కూడా పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే 70% శారీరక, 90% మెదడు (మానసిక) అభివృద్ధి ఈ వయసులోనే జరుగుతుంది. వయస్సును బట్టి కావాల్సిన క్యాలరీల శక్తి గల పౌష్టికాహారం అందించే లక్ష్యం కోసం 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ పుట్టింది. ఆరు సంవత్సరాల లోపు పిల్లల జీర్ణశక్తిని పరిగణలోకి తీసుకొని ఈ ఆహారాన్ని ఐసిడిఎస్ సప్లై చేస్తుంది. ఈ పౌష్టికాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరు సంవత్సరాల లోపు పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఉండదు. ఈ ఎదుగుదల లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యను నేర్చుకునే తెలివితేటలు కూడా ఈ పిల్లలకు రావు. పైగా శారీరక, మానసిక అభివృద్ధి జరగకపోతే జీవితాంతం శారీరక, మానసిక అంగవైకల్యంతో ఈ పిల్లలు బాధపడాల్సి వస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు తెలంగాణ భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అదే సందర్భంలో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఇప్పుడున్న సమాజం యొక్క పరిస్థితిలో చాలా అవసరమని మేము భావిస్తున్నాము. అలా అని ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయటం దీనికి పరిష్కారం కాదు. అలా చేస్తే ఒక డిపార్టుమెంటు బలోపేతం కోసం మరొక డిపార్టుమెంటును నాశనం చేయడమే అవుతుంది. ప్రభుత్వ విద్య బలపడాలంటే ప్రైవేటు విద్యను నిర్వీర్యం చేయాలి. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదు. ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి.
శారీరక, మానసిక ఎదుగుదల పర్యవేక్షణతో పాటు ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అందించడానికి కావాల్సిన విద్యార్హతతో పాటు అపారమైన అనుభవం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్క ఉంది. అయితే ఈ విద్యకు ఆటంకంగా ఉన్న ఐసిడిఎస్ కు సంబంధం లేని బీఎల్పీ తదితర అదనపు పనులను వెంటనే రద్దు చేయాలి. విద్యా మరియు ఐసిడిఎస్ శాఖలకు ప్రభుత్వం నిధులు పెంచి అన్ని మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్య రెండు సమానమనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ రాష్ట్ర నాయకులు పి రాజారావు గారు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. రమ్య, కే సుధారాధ అంగన్వాడి యూనియన్ రాష్ట్ర నాయకులు బి.కోటేశ్వరి, నాగమణి, పాపారాణి,ఉమ, విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.