బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్

తిరుమలగిరి 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో 14వ శతాబ్దపు ఐరోప చరిత్ర కాలంలో పాలకులు, పీడకులను ఎదిరించి పీడుతులను కాపాడటానికి కారణజన్ముడిగా వ్యవహరించిన జానపద సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రధాన పాత్రగా ఉన్న రాబిన్ హుడ్ పోరాట ధీరత్వానికి ఒక నమూనగా.. చరిత్ర నిర్మాణంలో తనదైన చెరగని పాత్రను నిర్వర్తించిన ఒక మహా యోధుడు తెలంగాణ గడ్డపై జన్మించాడు. అతడే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ దాదాపు 350 ఏళ్ల క్రితమే కుల మత జాతి వర్గ బేధాలు లేని సమాజం కోసం కృషిచేసిన బహుజన పోరాటయోధుడు గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆధిపత్య అగ్రకుల పాలకులు బహుజనుల అనగదొక్కుతున్న 17వ శతా బ్దంలో స్వీయ సైన్యంతో దక్కన్ పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు మహాత్మ పూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు తిరుమలగిరి మండల గౌడ సంఘం నాయకులు వేడుకలుగిలకత్తుల రాము గౌడ్, కొంపెల్లి రామ్మూర్తి గౌడ్, జలగం రామచంద్రన్ గౌడ్, నాతి వీరమల్లు గౌడ్, మోడేపు వీరన్న గౌడ్, తెలంగాణ ఉద్యమ గాయకుడు పాలకుర్తి శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, గిరి గౌడ్, లోడే సాయి గౌడ్, గిలకత్తుల కొమురెల్లి గౌడ్, గిలకత్తుల సంపత్ గౌడ్, జలగం వేణు గౌడ్, తిరుమలగిరి మండల అన్ని గ్రామాల గౌడ కులం సభ్యులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు