ప్రశాంతత వాతావరణంలో పండుగ నిర్వహించాలి సిఐ

నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి
పోలీసు వారి అనుమతి తప్పనిసరి...
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన నిర్వాహకులదే బాధ్యత....
డీజే అనుమతి లేదు ...
విద్యుత్ అనుమతి పొందవలెను...
తిరుమలగిరి 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిమజ్జనం సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా జాగ్రత్తలు పాటించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తిరుమలగిరి పోలీస్‌శాఖ వారి ఆధ్వర్యంలో తిరుమలగిరి మండలం కేంద్రంలోని ఆర్ వి ఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన గణేష్ ఉత్సవాల అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను మండలంలో కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునే సాంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలని కోరారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండపాలు ఏర్పాటు చేసుకునే సమ యంలో ముందుగా స్థలం యజమాని అనుమతి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతు లను నమ్మొద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా, పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అదించాలని సూచించారు. అత్యవసర పరిస్ధితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు. పోలీసుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసే భక్తులు, నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరిం చాలని చెప్పారు. వివిధ శాఖల అధికారులతో అనుమతులు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలుగ కుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు ,తహసిల్దార్ హరిప్రసాద్ ,డిప్యూటీ తహసిల్దార్ జాన్ మహమ్మద్ ,సానిటరీ సెక్రటరీ వార్డ్ ఆఫీసర్ పంగా శోభ ,మండల విద్యుత్ అధికారి రెహమాన్ , సంపత్ ,రమేష్ ,జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు కందుకూరు అంబేద్కర్ అబ్బాస్ హీర సార్ వివిధ గ్రామాలకు చెందిన వినాయక నిర్వాహకులు డీజే యాజమాన్యులు వినాయకుని విక్రయదారులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.....