వరద బాధితులను ఆదుకుంటాం ఆర్డీవో

తిరుమలగిరి 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఇటీవల కురిసిన వర్షానికి ఎస్సీ కాలనీలో ఇండ్లలో వర్షపు నీరు చేరడంతో రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యాపేట వేణుమాధవరావు మరియు తహసీల్దార్ హరిప్రసాద్ తో కలిసి సందర్శించారు కాలనీవాసులతో మాట్లాడుతూ ప్రజలూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని విధాల సహాయ ఏర్పాట్లు చేస్తామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు అనంతరం హైవే పై జరుగుచున్న బ్రిడ్జి పనులను పరిశీలించి వరద నీరు ఇండ్ల లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్ పక్కన ట్రెంచ్ కొట్టి మట్టి పోయాలని హైవే అధికారులను ఆదేశించారు వారి వెంట డిప్యూటీ తహసీల్దార్ జాన్ మహమ్మద్, జార్జిరెడ్డి, యాకుబ్ రెడ్డి పాల్గొన్నారు